హెబ్బా పటేల్‌ది డీ గ్లామర్‌ రోల్‌

0
100

హెబ్బా పటేల్‌ నటించిన తాజా సినిమా ‘24 కిస్సెస్‌’. ఇందులో అరుణ్‌ అదిత్‌ హీరో. అయితే… ప్రేక్షకుల అటెన్షన్‌ మాత్రం ఎక్కువగా హెబ్బాపై పడుతోంది. అందుకు కారణం… ప్రచార చిత్రాల్లోని ఘాటు ముద్దులే. పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌… పబ్లిసిటీ మెటీరియల్‌ ప్రతిదాంట్లోనూ ముద్దులతో నింపేశారు. అయితే… ఇదొక మార్కెటింగ్‌ స్ట్రాటజీ అంటోంది హెబ్బా పటేల్‌. సినిమాలో ఆమెది డీ గ్లామర్‌ రోల్‌! ‘కుమారి 21ఎఫ్‌’తో ఒక్కసారిగా తెలుగులో హెబ్బాకు క్రేజ్‌ వచ్చింది. ఆ తరవాత ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ ఆమె గ్లామరే ఎక్కువ కనిపించింది. ‘24 కిస్సెస్‌’లో మాత్రం తన నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారని హెబ్బా పటేల్‌ ధీమాగా వుంది. ప్రస్తుతం ప్రేక్షకులకు ‘24 కిస్సెస్‌’లో ముద్దులు మాత్రమే ముద్దలు మాత్రమే కనిపించొచ్చనీ, అందుకు వాళ్లను తాను తప్పుబట్టనని, ఒకవేళ తాను సినిమాలో భాగం కాకపోతే ప్రేక్షకుల వలే ఆలోచించేదాన్ని అనీ హెబ్బా పటేల్‌ అన్నారు. సినిమాలో తనది డీ గ్లామర్‌ రోల్‌ అనీ, మేకప్‌ వేసుకోకుండా నటించాననీ, ముద్దులను మించిన కథ, కంటెంట్‌ సినిమాలో వున్నాయని ఆమె స్పష్టం చేశారు. నటిగా తనకు ఈ సినిమా గుర్తింపు తీసుకొస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారామె. ఈ నెల 23న సినిమా విడుదల అవుతోంది. హెబ్బా పాత్ర ఎలా ఉంటుందో ఆ రోజు అందరికీ తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here